విజయవంతంగా ముగిసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా మహాసభలు

*నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షునిగా దూమర్ల భాస్కర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులనిగా చారకొండ బాలకృష్ణ ఎన్నిక

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాగర్ కర్నూల్ జిల్లా 4వ మహాసభలు గురువారం నల్లమల ప్రాంతంమైన అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూర్ అటవీ శాఖ పర్యావరణ ఎడ్యుకేషన్ సెంటర్ లో విజయవంతంగా జరిగాయి ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు చెందిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య హాజరయ్యారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో టిడబ్యుజెఎఫ్ ఎనలేని పోరాటం చేస్తుందని జర్నలిస్టులకు ప్రభుత్వం అందిచాల్సిన సదుపాయాలపై నిలదీస్తుందన్నారు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు అందే విధంగా కృషిచేస్తానని అన్నారు కొందరి స్వలాభం కోసం యూనియన్ ను రెండుగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారని అయినా టిడబ్ల్యుజేఎఫ్ దీటుగా ఎదుర్కొంటుంది అన్నారు చిన్న పత్రిక పెద్ద పత్రిక అనే తేడా లేకుండా జర్నలిస్టులు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షునిగా దూమర్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా రవికాంత్, కోశాధికారిగా బోడ పాండయ్య సహాయ కార్యదర్శిగా మంత్రాల శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా పెరుముల వెంకటేష్,నాగయ్య ఇసి మెంబర్లు గా పెరుముల రాజేష్, శివకృష్ణ, గుంత సరిత రాష్ట్ర కమిటీ సభ్యులుగా చారకొండ బాలకృష్ణ, పద్మనాభ రావు లు ఏకగ్రీవంగా ఎన్నికయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *