సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం రోడ్డులో బుధవారం ఉదయం భాష్యం స్కూల్ కి చెందిన బస్ విద్యార్థులతో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన సంఘటనలో డ్రైవర్ లైసెన్స్ అదేవిధంగా బస్ పర్మిట్ మూడు నెలలు సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. బస్ డ్రైవర్ ని విచారించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా బస్సులు ఏర్పాటు చేసుకోవాలని స్కూల్ యాజమాన్యానికి సూచించారు. రహదారి భద్రత ఉల్లంఘిస్తే ఎట్టిపరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.