సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29 పెబ్బేరు: మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని బుధవారం 6వ వార్డుకు చెందిన దూపం సర్వేష్ నామినేషన్ వేశారు. ఈ సందర్బంగా పురపాలక ఎన్నికల భాగంగా పెబ్బేరులో 12 వార్డులు ఉండగా 6వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధూపం సర్వేష్ కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని కమిషనర్ ఖాజా హరిఫ్ ధీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పురపాలక అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.