(సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ షేక్ అజ్మత్ అలీ) 29/01/2026, ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు మెట్ పల్లి : భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఉన్నారని, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంటామని బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు అన్నారు. మంగళవారం సాయంత్రం మెట్ పల్లి పట్టణంలోని పలు వార్డులకు చెందిన నాయకులు బీజేపీ పార్టీలో చేరారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెండో వార్డు నుంచి యామ రాధ, ఏడో వార్డు నుంచి ధర్మపురి స్వరూప, ఇల్లెందుల లత, 16వ వార్డు నుంచి అరిసె వనజ, మరి కొంత మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు పార్టీలో చేరగా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నాయకులు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ లో బీజేపీ జెండాను ఎగరేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, పార్టీ కోరుట్ల అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్, ప్రముఖ న్యాయవాది ఏలేటి నరేందర్ రెడ్డి, ఎనిమిదో వార్డు ఇంచార్జీ తల్లోజీ భాస్కర్, నాయకులు మిట్టపల్లి కృష్ణ మూర్తి, వడ్డేపల్లి శివ కుమార్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీలో చేరిన వారు, తదితరులు పాల్గొన్నారు.