సాక్షి డిజిటల్ న్యూస్ వైరా జనవరి 29/2026, ఖమ్మం జిల్లా వైరా చిలుము ఉపేందర్ రావు పల్లిపాడు రిటైర్డ్ ఉద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్ భిక్ష కాదని అది పెన్షనర్ల హక్కు అని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎం సుబ్బయ్య అన్నారు. వైరాలోని దత్త సాయి కళ్యాణ మండపంలో జరిగిన పెన్షనర్ల సదస్సు వైరా శాఖ అధ్యక్షులు చల్లా కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తున్న పెన్షన్ భారాన్ని నిలిపివేయాలని చూస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆందోళన చేపడుతుందని తెలిపారు. పెన్షనర్ల విభజన కోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకుంటామని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి పైడిపల్లి శరత్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు 2024 మార్చి నుండి ఇవ్వవలసిన ప్రయోజనాలను విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ పెన్షనర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు మరణించారని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లూరు వేణు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులు 30 సంవత్సరములు పైగా ప్రభుత్వానికి సేవ చేశారని ఉద్యోగ సమయంలో దాచుకున్న ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేయటం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని పెన్షనర్లకు ఇవ్వవలసిన ఆరోగ్య కార్డులను అన్ని ప్రభుత్వ మరియు కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలయ్యే విధంగా చూడవలసిన ప్రభుత్వం చోద్యం చూస్తుందని పెట్టాడు ఉద్యోగుల సహకారంతోనే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ప్రస్తుతం రాష్ట్రంలో పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన పెన్షనలకు రావాల్సిన రాయితీలను పెండింగ్లోని సమస్యలను పరిష్కరించకపోతే దాని పర్యవసానం ప్రభుత్వం మీద పడుతుందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖలు చర్చలకు పిలిచి పెండింగ్లోని సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఈ సదస్సులో ఖమ్మం జిల్లా ఖజానా అధికారి వై శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి మోదుగు వేలాద్రి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సాదినేని పూర్ణచంద్రరావు వైరా ఎస్ టి ఓ డి. యల్లయ్య, టీఎన్జీవో. వైరా డివిజన్ ప్రవీణ్, మధిర మండల శాఖ అబ్రహం
వైరా ఎస్బిఐ. టౌన్ బ్రాంచ్ మేనేజర్, బి. కోటేశ్వరరావు, వైరా మండల శాఖ ప్రధాన కార్యదర్శి మాచర్ల జయశంకర్ ఆర్థిక కార్యదర్శి సామినేని వెంకటేశ్వరరావు పైడిపల్లి సత్యనారాయణ సలహాదారులు టీవీ .కృష్ణయ్య సూరి అసోసియేట్ అధ్యక్షులు ఎస్.కె. వలిజాన్ ఉపాధ్యక్షులు ఎన్. పెంటయ్య, కె. సరస్వతి
కార్యదర్శులు జి. సుబ్బయ్య ప్రసాద్ కె. శారదదేవి, జిల్లా కౌన్సిలర్లు, జీవి. కృష్ణారావు, పొన్నం నరసింహారావు
కొంగర నాగేశ్వరరావు, ఏ. సాయిబాబు, ఎస్. పిచ్చిరెడ్డి వై. భోగేశ్వరరావు పి.జాన్, చింతోజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పెన్షనర్లకు, పూర్వ మండల శాఖ బాధ్యులకు ఆత్మీయ అతిధులచే సన్మాన కార్యక్రమం నిర్వహించడమైనది.