
సాక్షి డిజిటల్ న్యూస్ తేదీ 29 జనవరి 2025 యాదాద్రి జిల్లా గుండాల మండలం రిపోర్టర్ ఎండి ఉస్మాన్
గుండాల మండలంలోని సుద్దాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యమగాని బక్కయ్య గౌడ్ మృతదేహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, తాటి చెట్టు పై నుంచి ప్రమాదవ శాత్తు కింద పడి యమగాని బక్కయ్య గౌడ్ మృతి చెందడం అత్యంత బాధాకరమని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి రూ.10,000/- ఆర్థిక సహాయం, అందజేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా అందే అన్ని సంక్షేమ పథకాలు మృతుని కుటుంబానికి అందేలా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అండెం సంజీవరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు ధ్యాప కృష్ణారెడ్డి, ఏలూరి రామ్ రెడ్డి, గోల్కొండ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.