సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 29 గూడూరు రిపోర్టర్(చెన్నూరు మస్తాన్) గూడూరు సీనియర్, జూనియర్ సివిల్ కోర్టులకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరుగా గూడూరు మండలం పాలిచెర్ల గ్రామానికి చెందిన వనం ప్రసాద్ నియమించబడ్డారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గూడూరు బార్ కు చెందిన పలువురు న్యాయవాదులు వనం ప్రసాద్ ను అభినందనలు తెలిపారు.