గ్రామపంచాయతీ పనుల తీర్మానానికి కార్యదర్శి డబ్బులు డిమాండ్

*ఎంపీడీవో కి ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీటీసీ చీమ లక్ష్మయ్య

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 29 (పాలేరు రిపోర్టర్ పి వెంకన్న) పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గ్రామ పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా పట్టు విడని విక్రమార్కుల నిరంతరం కృషి చేస్తుంటే ఎర్రగడ్డ పంచాయతీ కార్యదర్శి మాధవి తీరుతో అది ఆచరణ సాధ్యం కావట్లేదని ఎర్రగడ్డ గ్రామ మాజీ ఎంపీటీసీ చీమ లక్ష్మయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఎర్రగడ్డ గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయగా ఆ సమావేశంలో ఎర్రగడ్డ గ్రామానికి చెందిన కొందరు నాయకులు గ్రామపంచాయతీలో అంతర్గత సిసి రోడ్లు అంగన్వాడి బిల్లింగ్ మరమ్మత్తులు పనుల నిమిత్తం కోరగా వెంటనే స్పందించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలిస్తూ నిధులు మంజూరు చేశారు. ఇట్టి పనుల్లో ఆ శాఖలకు సంబంధించిన అధికారులు వెంటనే పనులు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వగా ఎర్రగడ్డ గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి మాధవి తన స్వార్ధ ప్రయోజనాల కోసం గ్రామాల్లో కొందరు అగ్రకులాలను వారిని ప్రోత్సహిస్తూ దళితులపట్ల వివక్ష చూపుతూ ఈజిఎస్ ద్వారా గ్రామంలో సిసి రోడ్లు చేపట్టాల్సి ఉండగా గ్రామపంచాయతీ తీర్మానం ఇవ్వకపోవడంతో సుమారు పది లక్షల రూపాయల నిధులు వేరే గ్రామపంచాయతీకి మళ్లించినట్లు అధికారులు తెలిపినట్లు ఆయన తెలిపారు. జనవరి 26న గ్రామపంచాయతీలో ఈజీఎస్ పనులపై గ్రామసభ ఉందని తెలియజేయగా గ్రామ సభకు వెళ్లిన గ్రామస్తులు ఈజీఎస్ లో జరిగిన పనులపై వివరాలు అడగగా మీకు చెప్పవలసిన అవసరం లేదని మీ దిక్కున చోట చెప్పుకోమని కనీస మర్యాద లేకుండా ఆగ్ర వ్యక్తం చేస్తూ ఆమె దళితులపై వివక్ష చెబుతుందని వారు ఆరోపించారు. వెంటనే సంబంధిత కార్యదర్శి పై జిల్లా అధికారులు చర్యలు తీసుకొని ఆమె స్థానంలో కొత్త పంచాయతీ కార్యదర్శులు నియమించాలని ఎంపీడీవో కు ఆయన ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *