
సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 29, రామకృష్ణాపూర్: మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఆర్కే వన్ ఎ గని సమీపంలోని పాలవాగు వద్ద గల శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా జరుపు తున్నారు. మొదటిరోజు సారలమ్మను డప్పు చప్పుల మధ్య కోయ పూజారుల సమక్షంలో ఆర్కే వన్ ఏ పోచమ్మ తల్లి గుడికి చేర్చారు. అనంతరం అక్కడ పూజలు నిర్వహించి అక్కడి నుండి మేళతాళాల మధ్య గుస్సాడి నృత్యాలతో పోతురాజుల విన్యాసాలతో టపాసులు పేలుస్తూ భారీ బందోబస్తు మధ్య సారళమ్మను గద్దెకు తీసుకువెళ్లి ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి జిఎం రాధకృష్ణ, దంపతులు సింగరేణి అధికారులు ఏఐటీ యూయూసి నాయకులు, అక్బర్ అలీ, సలేంద్ర సత్యనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య, యూనియన్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఎస్ ఎన్ పి సి, రెస్క్యూ సభ్యులు , ఎన్ఎస్ఎస్ సభ్యులు భారీ బందోబస్తు నిర్వహించారు.