సాక్షి డిజిటల్ న్యూస్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ రిపోర్టర్ నటరాజ్ గాడ్ జనవరి 29, అంబర్ పేట్ నియోజకవర్గం గోల్నాక ప్రాంతానికి చెందిన దుర్గళ్ళ గణేష్ సతీమణి రేణుక కి నిమ్స్ హాస్పటల్ వైద్యులు అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని చెప్పడంతో వారు వైద్య ఖర్చులకు ప్రభుత్వం నుంచి సహాయం చేపించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను సంప్రదించడంతో ఎమ్మెల్యే తన కార్యాలయం నుంచి ప్రభుత్వానికి దరఖాస్తు చేయడంతో రేణుక కి ప్రభుత్వం నుంచి 3 లక్షల రూపాయల విలువైన ఎల్‌ఓసి ముంజూరు అయింది బుధవారం పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేణుక కి మంజూరు అయిన ఎల్‌ఓసి ని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దాల నరసింహ,సంకి రవీందర్, మురళీ ముదిరాజ్ లతో కలసి అందజేసి వారు త్వరగా కోలుకుని తిరిగి ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించాలని మనసారా ఆకాంక్షించారు.