సాక్షి డిజిటల్ న్యూస్ 29 జనవరి 2026 బనగానపల్లె నియోజకవర్గ రిపోర్టర్ రాంబాబు, బాల్య వివాహ ముక్త్ భారత్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నందు ఈవో పాండురంగా రెడ్డి చైర్మన్ మౌళీశ్వర రెడ్డి అధ్యక్షతన బాల్యవివాహాలపై వాటి చట్టాలపై అవగాహన కార్యక్రమం జరుపడమైనది. బాలికలకు 18 సంవత్సరాలు నిండకుండా బాలురకి 21 సంవత్సరాలు నిండకుండా వివాహం జరిపినట్లైతే అది బాల్య వివాహం అవుతుందని ఆలయంలో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి వీటిపై అవగాహన ఉండాలని జిల్లా బాలల సంరక్షణ విభాగం కౌన్సిలర్ సునీల్ కుమార్ తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి సోషల్ వర్కర్ ఓబులమ్మ అవుట్ టచ్ వర్కర్ కుమారి మహిళా సంరక్షణ కార్యదర్శి రూప ఆలయ సిబ్బంది పాల్గొనడం జరిగినది.