క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కంచుకోట కావాలి..

*ఎన్నికల ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు *కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి నమ్మకద్రోహం చేస్తే తాట తీస్తాం.. *కోర్ కమిటీ నాయకులు అబ్దుల్ అజీజ్

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 29, రామకృష్ణాపూర్: మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, మునిసిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ కౌన్సిలర్ ఆశా వాహ అభ్యర్థులతో దిశా నిర్దేశం కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభ్యర్థుల ఫైనల్ జాబితా నేడు స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి తెలియజేస్తారని అన్నారు. 22 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ దాఖలు కొరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆశావహులు చాలా మంది ఉన్నా సరే గెలిచే అభ్యర్థులకే టిక్కెట్ కేటాయించడం జరుగుతుందని తెలిపారు.ప్రజల కొరకు పని చేసే వారికి అవకాశం దక్కుతుందని అన్నారు.టిక్కెట్ దక్కని వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి అందర్నీ కాపాడుకుంటామని అన్నారు.నియోజక వర్గానికి కాంగ్రెస్ పార్టీ కంచు కోట గా నిలవాలన్నారు.గెలుపుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ప్రతీ ఇంటికి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను వివరించాలని తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ కోర్ కమిటీ సభ్యులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ… రాబోయే 3 ఏండ్లు మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి నమ్మకద్రోహం చేస్తే వారిని ఉపేక్షించేది లేదని, తాట తీస్తామని హెచ్చరించారు. పార్టీ, ప్రభుత్వం, యంత్రాంగం అన్ని మనయేనని పార్టీకి ద్రోహం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సూచించిన అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలే తప్ప నమ్మకద్రోహం చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, కోర్ కమిటీ సభ్యులు, 22 వార్డుల కౌన్సిలర్ ఆశావాహ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *