సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 29, మల్లాపూర్ మండలం రిపోర్టర్ ఆకుతోట నర్సయ్య: సాక్షి స్టడీ మెటీరియల్ తో పదో తరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఎంఈవో కేతిరి దామోదర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్లాపూర్ మండల కేంద్రంలో ని స్థానిక జడ్పి హైస్కూల్ లో పదో తరగతి విద్యార్థులకు సాక్షి ఆధ్వర్యంలో నిపుణులతో రూపొందించిన గణితం, భౌతిక శాస్త్రం స్టడీ మెటీరియల్ ను స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం చంద్రమోహన్ రెడ్డితో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణించాలని, నిరు పేద విద్యార్థులకు అండగా నిలవాలనే లక్ష్యం తో సాక్షి యాజమాన్యం ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేయడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధించాలని కోరారు. విద్యార్థులకు విలువైన స్టడీ మెటీరియల్ ను అందించిన సాక్షి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాక్షి సర్క్యూలేషన్ ఇంచార్జి సురేష్, సాక్షి రిపోర్టర్ తోకల పవన్, పాఠశాల ఉపాద్యాయులు భాస్కర్, సురేష్, నర్సయ్య, శివరాం, సజ్జన్న, రాజశేఖర్, రమేష్, విశ్వ, సాజిద్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.