ప్రజలు కష్టాలు తెలుసుకునేందుకే యువగళం పాదయాత్ర…కిరణ్ కుమార్

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 28 గూడూరు రిపోర్టర్ (చెన్నూరు మస్తాన్) ప్రజల కష్టాలు ఇబ్బందులను తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా తిరిగి వారి సమస్యలు తెలుసుకున్నారని అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సమస్యలు పరిష్కరించడం జరిగిందని గూడూరు పట్టణానికి చెందిన టిడిపి రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ వెల్లడించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవ్వగలం పాదయాత్ర జరిగి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చిల్లకూరు జాతీయ రహదారి నుండి సాయిబాబా దేవస్థానం వరకు టిడిపి నాయకుల ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ ద్వారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది షిరిడి సాయిబాబా మందిరంలో నారా లోకేష్ ఆరోగ్యంగా ఉండాలని నాయకులు పూజలు నిర్వహించారు టిడిపి రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ… తెలుగుదేశం జెండా పేదవాడి ఖండాన నినాదంతో ఎన్టీ రామారావు పార్టీని స్థాపించారని ఆయన ఆశయాలను కొనసాగిస్తూ నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారని అప్పటి వైసిపి ప్రభుత్వం పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టించిందని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకొని నేనున్నానంటూ భరోసా కల్పించి అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సమస్యలు పరిష్కరించడం జరిగిందని, రాబోయే భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ కు టిడిపి నాయకులు కార్యకర్తలు అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు నెలబల్లి భాస్కర్ రెడ్డి,పులిమి శ్రీనివాసులు, చెంచురామయ్య ,లీలావతి, హరికుమార్ , వెంకటేశ్వరరాజు , శివకుమార్ మస్తాన్ నాయుడు ,పట్టాభి రామిరెడ్డి, కొండా రామచంద్రారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చిరంజీవి ,జలీల్ భాషా, కిషోర్ నాయుడు ,వెంకటేష్ సునీల్, ముమ్మడి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *