హుజురాబాద్ జిల్లా కోసం హోరోత్తిన నిరసన

సాక్షి డిజిటల్ న్యూస్ కరీంనగర్,హుజరాబాద్ రిపోర్టర్ దాసరి జీవన్ రెడ్డి : హుజురాబాద్ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ నిరసనలు ఉదృతమయ్యాయి. మంగళవారం మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బస్ డిపో నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి, జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో వరంగల్- కరీంనగర్ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. జిల్లా ఏర్పాటు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నిరసనకారులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *