వర్ధన్నపేట. సాక్షి డిజిటల్ న్యూస్. రిపోర్టర్. కుందూరు మహేందర్ రెడ్డి. జనవరి. 27. వర్ధన్నపేట నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా సంచలన సమీకరణాలు జరుగుతున్నాయి. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి సొంతగూటికి( టిఆర్ఎస్) వెళుతున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామంతో భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకత్వం షాక్ కి గురైంది. 2014. మరియు 2019. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆరూరి రమేష్ 2023లో స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తరువాత జరిగిన పరిణామాల్లో భారతీయ జనతా పార్టీలో చేరి వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్న ఆదరణ తో పార్లమెంట్ ఎన్నికల్లో గెలువచ్చని ఆలోచనతో భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీ గెలుపు కోసం మరియు తన గెలుపు పార్టీ కోసం కృషిచేసిన ఆరూరి రమేష్ ఓడిపోయారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం తనకు సరైన గుర్తింపు బాధ్యతలు ఇవ్వకపోవడం వల్ల మళ్లీ తిరిగి సొంతగూటికి వెళ్లినట్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు గుసగుసలాడుతున్నారు. అరూరి రమేష్ వర్ధన్నపేట నియోజకవర్గం లో పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన కూడా జిల్లా మరియు రాష్ట్ర నాయకత్వం గుర్తించకపోవడం వల్ల మారినట్లు ఆయన సన్నిహిత వర్గాలు మాట్లాడుకుంటున్నారు. గతంలో 10 సంవత్సరాలు వర్ధన్నపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధినాయకత్వం తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించడం వల్లనే ఆయన పార్టీ మారినట్టు ఆరూరి రమేష్ ఓ పత్రిక ప్రకటనలో తెలియజేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఎంత ప్రయత్నం చేసినా పార్టీ గుర్తించలేదని పార్టీ అమలు చేస్తున్న నియమాలు మాజీ ఎమ్మెల్యే అయినా రమేష్ కి తెలియకుండా అమలు చేస్తున్న విషయంలో అసంతృప్తి చెందారని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఆరూరి రమేష్ పార్టీ మారడం వల్ల టిఆర్ఎస్ పార్టీకి గత వైభవం మళ్లీ వస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.