సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 28 రిపోర్టర్ షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామ పంచాయతీ లో రామచంద్రపురం గ్రామంలో 2రోజుల క్రితం పూనెం దుర్గా భవాని అనారోగ్యం తో ఖమ్మం లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో మరణించడం జరిగింది. ఈ విషయం రామచంద్రపురం గ్రామస్తులు జిల్లా కాంగ్రెస్ నాయకులు దుద్దుకూరి సుమంత్ కు తెలపగ, వెంటనే ఆసుపత్రి యాజమాన్యం మరియు డాక్టర్ తో మాట్లాడి బిల్ లేకుండా దుర్గా డెడ్ బాడీ ని పంపించేవిధంగా దుద్దుకూరి సుమంత్ యాజమాన్యాన్ని కోరారు. వారు సానుకూలంగా స్పందించి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు రామచంద్రపురంలో దుర్గా కుటుంబాన్ని పరామర్శించి, దుర్గా తండ్రి, మాజీ సర్పంచ్ పూనెం వెంకటేశ్వర్లు ని ఓదార్చారు. దుర్గా చిన్న వయస్సులోనే మృతి చెందడం దురదృష్టం అన్నారు. దుర్గా పీజీ వరకు చదివి ఇలా కోల్పోవటం ఆ కుటుంబానికి తీరని లోటన్నారు.దుర్గా కుటుంబానికి సంతాపాన్ని, సానుభూతి ని తెలియచేసారు. మిత్రుల సహకారంతో దుర్గా కుటుంబానికి దుద్దుకూరి సుమంత్ 5000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.ఈ కార్యక్రమం లో గ్రామ శాఖ అధ్యక్షులు గాదె కృష్ణయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంచర్ల హరీష్, జవ్వాది వీరయ్య, భూక్యా నర్సింహారావు, వార్డు సభ్యులు వేల్పుల గోపాలకృష్ణ, దొప్ప సత్యం, చింతకాయల శ్రీను, పూనెం పద్మ, ముక్తి లక్మి, వాడె నర్సింహారావు, పూనెం సత్యావతి, జారే సీత, స్వరూప, ముక్తి రాజులు, ముక్తి రమేష్ బాబు, ముక్తి వెంకటేశ్వర్లు, ఈసం శివాజీ రాహుల్ పూనెం, పూనెం నవీన్ తదితరులు పాల్గొన్నారు.