శ్రీకాకుళం జిల్లా, సాక్షి డిజిటల్ న్యూస్, ఇచ్చాపురం మండలం, రిపోర్టర్ ధర్మవరపు తులసి రావు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయులు కె. సూర్యారావు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఈ కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల చేసిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సభను ఉద్దేశించి ప్రధానో పాధ్యాయులు కె సూర్యారావు, మాట్లాడుతూ పిల్లలు మంచిగా చదుకొని పాఠశాలకు,తల్లిదండ్రులు మంచి పేరు తీసుకొని రావాలని చెప్పారు. ఈ కార్యక్రమం లో దాత వజ్రపు వెంకటేష్, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ ఆసి లత, కో ఆప్షన్ సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.