వివిధ రూపాల్లో కొనసాగనున్న కంటోన్మెంట్ విలీన పోరాటం, రిలే నిరహార దీక్షకు భారీ స్పందన.

*రిలే నిరహార దీక్ష ముగింపులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ .

సాక్షి డిజిటల్ న్యూస్ కంటోన్మెంట్ బోవెన్‌పల్లి రిపోర్టర్ నటరాజ్ గాడ్ జనవరి 28, కేంద్ర ప్రభుత్వం వెంటనే కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం కోసం పోరాడుతున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మొదటి అడుగులో భాగంగా చేస్తున్న రిలే నిరహార దీక్షను ఈరోజు ముగించారు.చివరి రోజు దీక్షకు తెలంగాణ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, టిపిసిసి జనరల్ సెక్రటరీలు నర్సారెడ్డి భూపతి రెడ్డి, పృధ్వీ చౌదరి,బియస్పి నాయకులు రాజేందర్ తమ సంఘీభావాన్ని తెలియజేశారు. రిలే నిరాహార దీక్ష ముగింపు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలని చేస్తున్న పోరాటంలో భాగంగా కంటోన్మెంట్ ప్రజలు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు భారీ స్పందన నియోజకవర్గ ప్రజలు, మేధావులు, కవులు , కళాకారులు, నాయకుల భారీ మద్దతుతో రిలే నిరహార దీక్ష ఈ ఉద్యమం భవిష్యత్తులో మరింత రూపాంతరం చెంది వివిధ రూపాల్లో కంటోన్మెంట్ బోర్డు విలీనం కోసం పోరాటం కొనసాగుతుంది. ప్రజాస్వామ్యంలో ఏదీ ఒక్కరోజులో సాధ్యం కాదు దేశ స్వాతంత్ర పోరాటమైనా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటమైనా ఎన్నో ఏళ్ల పాటు కొనసాగి ప్రజల మద్దతుతో విజయవంతం అయ్యాయి. మేము కూడా ఆ ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ కంటోన్మెంట్ బోర్డు విలీన పోరాటాన్ని భవిష్యత్తులో మేధావులు, పెద్దలందరితో చర్చించి వివిధ రూపాల్లో ఉద్యమాన్ని కొనసాగించి విలీనాన్ని సాధిస్తాం కంటోన్మెంట్ ప్రజల పోరాటంతో కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు లేకుండా నామినేటెడ్ వ్యవస్థతో ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఖూనీ చేస్తున్న వైనాన్ని ఈటల రాజేందర్ కూడా ఒప్పుకోకనే ఒప్పుకున్నారు. ఈ రిలే నిరాహార దీక్ష ద్వారా కంటోన్మెంట్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తీరు రాష్ట్రవ్యాప్తంగా, జాతీయ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా చర్చకు జరిగింది. ఇది మా కంటోన్మెంట్ ప్రాంత ప్రజల మొదటి విజయం కంటోన్మెంట్ విలీన పోరాటానికి ఈ రిలే నిరాహార దీక్ష తొలి మెట్టు కంటోన్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం అయితే కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలను ఈ రిలే నిరాహార దీక్ష ద్వారా అందరికీ తెలియడం మేం సాధించిన మొదటి విజయం. ఈటెల రాజేందర్ ఇప్పటికైనా కంటోన్మెంట్ ప్రాంత ప్రజల ప్రయోజనా లను దృష్టిలో పెట్టుకుని కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విలీన ప్రక్రియ మొదలయ్యేలా చూడాలి భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం, మా ప్రాంత ప్రజల పోరాటానికి మద్దతు తెలిపి సంఘీభావంగా దీక్షా శిబిరానికి వచ్చి మా ప్రాంతిప్రజల అభివృద్ధి కోసం మా అడుగులో అడుగు వేసి మా అందరికీ వెన్నుదన్నుగా నిలిచిన నాయకులు, వివిధ ప్రజా సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు అందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *