సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 పెనగలూరు రిపోర్టర్ మధు, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఈ నెల 23 వ తేదీ విజయవాడ లో నిర్వహించిన ‘రంగోత్సవం-2026’ పోటీలలో పెనగలూరు మండలం నల్లపురెడ్డి పల్లె విద్యార్థినులు తృతీయ బహుమతి ని సాధించారు.ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థినులు ఝాన్సీ, హిమజ, తులసి మరియు మేనక లను మరియు వారి తల్లిదండ్రులను యుటిఎఫ్ పెనగలూరు మండల శాఖ ఆధ్వర్యంలో మెమెంటో, దుశాలువా లతో ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు కె. క్రిష్ణ మూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభ లో యుటిఎఫ్ రాష్ర్ట నాయకులు బి. హరి ప్రసాద్ మాట్లాడుతు మంచి కళా నైపుణ్యంతో దేశాభివృద్ధి, సాంకేతికత మరియు సంస్కృతిని మేళవిస్తూ వారు వేసిన ఈ ముగ్గులు పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అభినందిచారు. ఈ కార్యక్రమం లో యుటిఎఫ్ నాయకులు యం. సతీష్, జి. వాణి, డి. పద్మశ్రీ, నజీమ్, సురేంద్ర, ప్రమోద్ కుమార్ రెడ్డి, గైడ్ ఉపాధ్యాయులు రవిశంకర్ రెడ్డి, మరియు పాఠశాల ఉపాధ్యాయులు నరసింహులు,శ్యామ్ సుందర్, చంద్రమోహన్, విజయ్ కుమార్, వెంకట సుబ్బయ్య,క్రిష్ణ రెడ్డీ, శేషపాణి, లక్ష్మీ దేవి, అమర్, రెడ్డి బాబు ,సుబ్బరాయుడు, హరి నాధ్,లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.