సాక్షి డిజిటల్ న్యూస్,జనవరి 28, (శేరీలింగంపల్లి): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్‌లో బీజేపీ సీనియర్ నాయకుడు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఫైనల్ పోటీలో మక్త వారియర్స్ కెప్టెన్ జె. శ్రీధర్ జట్టు, మక్త లెజెండరీ కెప్టెన్ కే. నాగులు జట్టు మధ్య ఉత్కంఠభరితంగా పోటీ జరగగా, కే. నాగులు నాయకత్వంలోని మక్త లెజెండరీ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులు, గెలుపొందిన జట్టుకు ట్రోఫీ అందజేశారు. యువత క్రీడలపై దృష్టి సారించాలని, క్రీడల ద్వారా ఏకాగ్రతతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని గణేష్ ముదిరాజ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాజరవు శీను పాల్గొన్నారు.