అనంతపురం నూతన జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఆహ్వానం పలికిన ఎమ్మార్పీఎస్ నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్, అనంతపురం జనవరి 28, అనంతపురం జిల్లా ఇన్చార్జ్ ముంగా ప్రదీప్ అనంతపురం నూతన జాయింట్ కలెక్టర్ (జె.సి.) ఎమ్మార్పీఎస్ బి.సి.ర్. దాస్ ఆధ్వర్యంలో దబ్బల శ్రీరాములు, రసూరి శివ, దొడ్డెప్ప, జె. శేఖర్, నాగమ్మ శాంతి, తిప్పన్న, బి. నాగరాజు, పెద్దలయ్య, రవిశాల తదితరులు శుభాకాంక్షలు తెలియజేస్తూ మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉమ్మడి అనంతపురం జిల్లాలో జిల్లా పరిషత్ లెక్కల ప్రకారం గతంలో పనిచేసిన జాయింట్ కలెక్టర్–డిప్యూటీ కలెక్టర్ రోశయ్య కాలం నుంచి ఇటీవల పనిచేసిన జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ వరకు మొత్తం 10,985 సి/3 గ్రామాలలో దళితుల మృతదేహాలను పూడ్చుకునేందుకు సరైన శ్మశాన స్థలాలు లేవని పలు మార్లు సంబంధిత జాయింట్ కలెక్టర్ల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు కేవలం (485)నాలుగు వందాల ఎన్నబాయ్ ఐదు గ్రామాలకు మాత్రమే మొత్తంఏడు మంది జాయింట్ కలెక్టర్లు శ్మశాన స్థలాలను కేటాయించారని, ఇంకా మిగిలిన 613 గ్రామాలలో దళితులకు శ్మశానాలకు స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులుగురి ఎదురవుతున్నాయని వివరించారు. మిగిలినజిల్లా లో ప్రతి గ్రామాలలోనూదళితులకు వెంటనే శ్మశాన స్థలాలను కేటాయించి, దళితులకుస్వచ్ఛమైన న్యాయం చేయాలని నూతన జాయింట్ కలెక్టర్ కోరారు.ఈ సమావేశంలో కులా సంఘం నాయకులు పాలుగోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *