సాక్షిడిజిటల్ న్యూస్, జనవరి 28, రాయికల్, వై.కిరణ్ బాబు: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో అధ్యక్షునిగా చెలిమెల మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా ఇమ్మడి విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా దుగ్యాల రమాపతిరావు, కోశాధికారిగా గంట్యాల ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ షాకీర్, సామల్ల మహేష్, సంయుక్త కార్యదర్శిగా పడాల రమేష్, సాంస్కృతిక కార్యదర్శిగా బెక్కం సుధాకర్, గౌరవ అధ్యక్షునిగా మాలావత్ వెంకటేష్ మరియు కార్యవర్గ సభ్యులుగా మామిడి రాజు, బొమ్మ కంటి అనిల్, తిరుమల శంకర్ గంగుల శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గానికి సభ్యులందరూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో సీనియర్ పాత్రికేయులు చింత కుంట సాయి కుమార్, యాచమనేని కిరణ్ బాబు, సయ్యద్ రసూల్ పాత్రికేయులు పాలేపు గణేష్ తదితరులు పాల్గొన్నారు.