సాక్షి,డిజిటల్ న్యూస్, జనవరి 28 2026 (రిపోర్టర్ ఇమామ్ ), ఈనెల 28 నుండి 31 వరకు మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్లో 69వ జాతీయస్థాయి ఎస్ జి ఎఫ్ ఎస్ జి ఎఫ్ ఐ 17 సంవత్సరాల లోపు బాలుర
నెట్ బాల్ పోటీలకు నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని కొండాపూర్ పి ఎం శ్రీ గిరిజన గురుకులంలో 9వ తరగతి చదువుతున్న కే శివ, కె అరుణ్ లు తెలంగాణ రాష్ట్ర 17 సంవత్సరాల లోపు బాలుర నెట్ బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించుటకు ఎంపికయ్యారు. ఈ క్రీడాకారులు గత ఈనెల 16 నుండి 18 వరకు ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జట్టుకు (ఫస్ట్ రన్నర్ ఆఫ్ రెండవ బహుమతి సిల్వర్ మెడల్) సంపాదించుటలో కీలక భూమిక ప్రదర్శించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు అని ప్రిన్సిపాల్ రాజారాం తెలిపారు. మంగళవారం తెలిపారు.
వీరి ఎంపిక పట్ల కోచ్ డాక్టర్ రామ్మోహన్ గౌడ్ పి ఈ టి ఆంజనేయులు హౌస్ అనిల్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు.