సాక్షి డిజిటల్ న్యూస్, రిపోర్టర్ బొక్కానాగేశ్వరరావు, జనవరి 28 2026, ఎన్టీఆర్ జిల్లా నందిగామ యెగా గురూజీ గాడిపర్తి సీతారామారావు వారిని ఘనంగా సన్మానించిన కె.యం.ఆర్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.మహేంద్రఎన్టీఆర్. జిల్లా నందిగామ పట్టణం లో 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యోగా తో సమాజానికి ఉత్తమ సేవలు అందించినందుకు గాను యోగా గురూజీ గాడిపర్తి సీతారామారావు ని శాలువా తో ఘనంగా సన్మానించిన కె.ఎం.ఆర్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. మహేంద్ర, ఈ సందర్భంగా డాక్టర్.మహేంద్ర మాట్లాడుతూ యోగా లో ఉత్తమ సేవలు అందిస్తున్న యోగా గురువు గాడిపర్తి సీతారామారావు ని అభినందించారు. ముందు ముందు ఇంకా యోగా తో సమాజానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో డాక్టర్. మహేంద్ర , డాక్టర్. రాధ , కోమటి రవి, కళాశాల ప్రిన్సిపాల్ మరియు విధ్యార్థినీ విధ్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.