షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చెయ్యాలి

*మానవ హక్కుల రాష్ట్ర బోర్డు డైరెక్టర్ కిముడు గణపతి( గణేష్)

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 28 జి.మాడుగుల: ఇప్పటికే స్వాతంత్రం వచ్చి ఏళ్ళు గడుస్తున్న గిరిజన ప్రాంత అభివృద్ధిలో లో విద్యా,వైద్యం, రహదారులు రంగాలు, జీవన విధానాలు మెరుగు పడని స్థితిలో గిరిజన ప్రాంత ప్రజలు ఉండగా ప్రభుత్వాల వైఫల్యాల వల్లే జరిగిన ప్రాంత అభివృద్ధి కుంటుపడుతుంది. భారత రాజ్యాంగ గిరిజనులకు వరంగా ఇచ్చిన షెడ్యూల్ 5 లో గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం పొందపరచిన హక్కులను కాలరాసే స్వార్థపూరిత విధానాన్ని ప్రభుత్వాలు పక్కన పెట్టీ గిరిజన ప్రాంతంలో ఉద్యోగవ నియమక చట్టం చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వర్యులు జీవో నంబర్ 3 కి బదులుగా ప్రత్యామ్నాయ జీవో అమలు చేసి గిరిజనులకు ఉద్యోగ నియామకంలో అన్యాయం జరగనివ్వనని చెప్పిన మాటను నైతికంగా నిలబెట్టుకుని గిరిజన ప్రాంత నిరుద్యోగులకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని నివారించి తక్షణమే న్యాయం చెయ్యాలి. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ నియమ నిబంధనల ప్రకారం వేలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న గిరిజన ప్రాంత ప్రత్యేక డీఎస్సీ ని తక్షణమే ప్రకటించి న్యాయం చెయ్యాలి.రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక ఆర్డినెన్సు జారీ చేసి మైదాన ప్రాంత డీఎస్సీ నియామక అభ్యర్ధుల ఆర్డర్స్ అన్ని రద్దు చెయ్యాలి. ఇప్పటికే ఐసిడిఎస్, ఏకలవ్య, గురుకులం, మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, డీఎస్సీలో ఇలా వేల ఉద్యోగాలు కోల్పోయామని ఆయన అన్నారు. గిరిజన ప్రాంత ప్రజల జీవన విధానాలతో ముడిపడి ఉన్న ఈ అన్ని అంశాలకు అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రాంత పర్యటనకు వస్తున్న గౌరవ ముఖ్య మంత్రి వర్యులు గిరిజన ప్రజానికానికి సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కులు మరియు అవినీతి నిరోధక సంస్థ రాష్ట్ర విభాగం డైరెక్టర్ కిముడు గణపతి (గణేష్) గిరిజన ప్రాంత ప్రజలు తరుపున మీడియా ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వనికి డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *