సాక్షి డిజిటల్ న్యూస్, అనంత జనవరి 28, అనంతపురం జిల్లా ఇంచార్జ్ ముంగ ప్రదీప్ అనంతపురం జిల్లా కేంద్రంలో పోలీస్ ప్యారెట్ గ్రౌండ్లో సోమవారం రోజున 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్రం కోసం అలుపెరగని పోరాటం చేసి ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఎందరో మహానుభావులను స్మరించుకుంటూ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ప్రభుత్వనికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజలకు ఉత్తమ ఆరోగ్య సేవలను అందిస్తున్నా కూడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఉషారాణి కి జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ విష్ణు చరణ్, మరియు డిఎంహెచ్ఓ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కు, డిఎంహెచ్ఓ ఈ బి. దేవి కి డాక్టర్ ఉషారాణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎం పి హెచ్ ఎ కుమారి డిఎంహెచ్వో ఈ బి. దేవి ద్వారా అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో ఈబీ దేవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.