అతికారి వెంకటయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

*వెంకటయ్య చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న మంత్రి కందుల దుర్గేష్

సాక్షి డిజిటల్ న్యూస్, సిద్ధవటం, జనవరి :27 (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసుల ఆంజనేయులు ) సీనియర్ జనసేన నాయకులు అతికారి వెంకటయ్య మరణం జనసేన పార్టీకి తీరనిలోటని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మండల కేంద్రమైన సిద్దవటం దిగువపేట ఆకులవీధిలోని ఆయన స్వగృహంలో సోమవారం జనసేన సీనియర్ నాయకులు అతికారి వెంకటయ్య మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ పూలమాల వేసి సంతాపం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలకు పైబడి కృషి, పట్టుదలతో ధైర్యవంతుడిగా రాజకీయ పరంగా తనదైన శైలిలో మంచి నాయకునిగా గుర్తింపు పొందారన్నారు. పేద ప్రజల కష్టాలు తీర్చే నేతగా అతికారి చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన అకాల మరణం బాధాకరమైన విషయమన్నారు. ఆయన మన ముందు భౌతికంగా లేనప్పటికీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన సోదరుడు అతికారి కృష్ణ, కుమారుడు అతికారి దినేష్ లు కృషి చేస్తారన్నారు. రాయలసీమ ప్రాంతంలో ప్రముఖ వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా అంచలంచలుగా ఎదిగి అందరి ఆధరాభిమానాలు చూరగున్నారని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నామన్నారు. వీరి కుటుంబానికి అన్నివిధాలా జనసేన పార్టీ అండగా వుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ, జనసేన రాజంపేట అసెంబ్లీ సమన్వయకర్త అతికారి దినేష్, అతికారి వెంకటయ్య సోదరులు అతికారి వెంకట సుబ్బయ్య, కడప జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకట సుబ్బయ్య, జనసేన పార్టీ పులివెందుల సీనియర్ నాయకులు దాసరి రవిశంకర్, జనసేన పార్టీ వేంపల్లి మండలం నాయకులు గోసల ఆంజనేయులు, మైదుకూరు మార్కెట్ యార్డ్ మెంబర్ లక్ష్మీ భరత్, ఆంధ్ర ప్రదేశ్ కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కేపీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *