సాక్షి డిజిటల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మొహమ్మద్ నయీమ్ జనవరి 26 భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి పట్టణంలో వేడుకలు అంబరాన్నంటాయి. కామారెడ్డి నియోజకవర్గ కార్యాలయం మరియు కాంగ్రెస్ భవన్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
డిసిసి మాజీ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, తాజా మాజీ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, వార్డు ఇంచార్జిలు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కైలా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలే మనకు శ్రీరామరక్ష దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఈరోజు దేశంలో సామాన్యుడికి సైతం సమాన హక్కులు లభిస్తున్నాయి.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పునాదులపై నిర్మితమైన మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ముఖ్యంగా యువత రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య విలువల కోసం కట్టుబడి ఉంటుంది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మనం ముందుకు సాగాలి. పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు మాట్లాడుతూ సేవా దృక్పథంతో ప్రజల్లోకి వెళ్దాం
పార్టీ బలోపేతం మరియు ప్రజా సేవల గురించి ప్రస్తావించారు. గణతంత్ర దినోత్సవం మన ఆత్మగౌరవ ప్రతీక. కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతోంది. వార్డు ఇన్చార్జిలు, కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాలి. ప్రజాస్వామ్య పండుగను ఇంత ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. క్రమశిక్షణతో కూడిన రాజకీయాలతో నియోజకవర్గ అభివృద్ధికి మనమంతా పునరంకితం కావాలి. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ మరియు మండల స్థాయి కార్యకర్తలు, వార్డు ఇంచార్జిలు. పాల్గొన్నారు..