ఉజ్వల హైస్కూల్ లోగణతంత్ర దినోత్సవం వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి:27. వేములవాడ టౌన్ రిపోర్టర్: అక్కనపల్లి పరశురాం, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లోని ఉజ్వల హైస్కూల్ లో 77 గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్కూల్ కరస్పాండెంట్ వి అరుణాద్రి జెండా ఆవిష్కరణ చేశారు. ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం కేవలం ఒక జాతీయ వేడుక కాదు – ఇది మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి, భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దిన రోజుకు నివాళి. మనల్ని నిర్వచించే ఆదర్శాలను గౌరవించడానికి మరియు మనం కలిసి సాధిస్తున్న పురోగతిని జరుపుకోవడానికి ఇది ఒక క్షణం.పౌరులు – ముఖ్యంగా విద్యార్థులు, యువత మరియు సృజనాత్మక మనస్సులు – వారి దేశభక్తిని వ్యక్తపరచాలని, వారి ప్రతిభను ప్రదర్శించాలని మరియు బలమైన, ఐక్యమైన మరియు ప్రగతిశీల భారతదేశం కోసం వారి దార్శనికతను పంచుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాల పిల్లలు వేషధారణతో గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నెలకొంది ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ పి. వెంకటేశ్వర్లు. మరియు ఉమారాణి.బాలచందర్. పాఠశాల ఉపాధ్యాయునీ. ఉపాధ్యాయులు శ్రీధర్. సంధ్య. రజియా. మౌలిక. సారిక. మమత. శ్రావణి. మాధవి. జయంతి. రమ్య. అలేఖ్య. స్వాతి.పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *