సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26 మంచిర్యాల్ జిల్లా ప్రతినిధి లింగంపల్లి మహేష్, మంచిర్యాల జిల్లా కన్నపెల్లి మండల్ జజ్జరవెల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో జజ్జరవెల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగంపల్లి ముఖేష్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించిందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, దేశాభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులు లింగంపల్లి ముఖేష్ రాజుకుమార్ , చంద్ర శేఖర్, దేవందర్, కిరణ్, పవన్ కళ్యాణ్, వంశీ, కుమార్, మల్లేష్, రాజేష్ మరియు మహిళ సంఘాలు మాజీ ఎంపీటీసీ నయితం రజిత, జజ్జరవెల్లి గ్రామ సర్పంచ్ వడుగురి శాంత చిన్నబాబు మరియు ఉప సర్పంచ్ కొట్రంగి రాజుకుమార్ మరియు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
