సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26, పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ( గంగాడ గౌరీ శంకర్ ) పాలకొండ నియోజకవర్గం లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం నాడు అత్యంత వైభవంగా జరిగాయి.
వీరఘట్టం మండలం నడుకూరు పంచాయతీ కార్యాలయం ఆవరణలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నడుకూరు ఎంపీటీసీ సభ్యురాలు ఎర్రపాత్రుని జయశ్రీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26 నుండి భారతదేశం, గణతంత్ర దేశంగా మారిందని రాజ్యాంగం దేశ ప్రజలకు, స్వేచ్ఛ,రక్షణ ఎన్నో హక్కులను ప్రసాదించిందని అన్నరు.ఈ 77 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని స్వాతంత్ర సమరయోధులు చేసిన సేవలు త్యాగాలు మరువలేనివి అని కొనియా డారు. ఈ సందర్భంగా జాతీయజెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు వెలగాడ శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి శివ సచివాలయ సిబ్బంది పాఠశాల విద్యార్థులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.