సాక్షి డిజిటల్ న్యూస్ జమ్మికుంట 26 జనవరి 2026 టౌన్ రిపోర్టర్, జమ్మికుంట: వాసవి వనితా క్లబ్, జమ్మికుంట ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు అయిత శ్రీలత నివాసం ముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వాసవి వనితా క్లబ్ సభ్యులు పాల్గొని దేశభక్తి గీతాలు ఆలపిస్తూ గణతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ, రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని సభ్యులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ వేడుకలు స్థానికంగా అందరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించాయని క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి వనిత అధ్యక్షురాలు అయితే శ్రీలత ప్రధాన కార్యదర్శి చొక్కారపు జ్యోతి కోశాధికారి మధ్య సురేఖ చార్టెడ్ ప్రెసిడెంట్ గర్రెపల్లి అరుణాదేవి. జోన్ చైర్పర్సన్ అఖిలండమ్ వాసవి అంతా క్లబ్ సభ్యులు పాల్గొనడం జరిగింది.
