సాక్షి డిజిటల్ న్యూస్ 26 జనవరి 2026 జమ్మికుంట టౌన్ రిపోర్టర్, జమ్మికుంట మండల మరియు పట్టణ మహిళ ఆర్యవైశ్య యువజన సంఘాల ఆధ్వర్యంలో స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తి భావాలను ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు కె ర్ వి నర్సయ్య, పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు శ్యామ్ కిషోర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, ఆర్యవైశ్య సంఘ పాలనా నాయకులు, మహిళా సంఘ సభ్యులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగ విలువలు, సమానత్వం, సౌభ్రాతృత్వం, దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడి బాధ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమం యువతలో దేశభక్తి భావనను పెంపొందించేలా నిర్వహించబడిందని వారు పేర్కొన్నారు. చివరగా దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.