77వ గణతంత్ర దినోత్సవం – రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి – స్వర్ణటోల్ సూపర్వైజర్ సారధి

సాక్షి డిజిటల్ న్యూస్, రిపోర్టర్ బొక్కానాగేశ్వరరావు, జనవరి 27 2026, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం
కీసర దేశ స్వాతంత్ర్యానికి ప్రాణత్యాగం చేసిన మహానీయుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛాయుత భారతమని, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను తెలుసుకుంటూ బాధ్యతలు నిర్వర్తించినప్పుడే నిజమైన పౌరసత్వం అవతరిస్తుందని సెక్యూరిటీ మేనేజర్ ఉమామహేశ్వరరావు అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కీసర టోల్ ప్లాజా కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పెట్రోలింగ్ ఆఫీసర్ ప్రసాద్ మాట్లాడుతూ… “ఈ గణతంత్ర దినోత్సవం మన దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకునే పవిత్ర దినం. వారి అమూల్య త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నాం. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను తెలుసుకుంటూనే, మన బాధ్యతలను కూడా నిబద్ధతతో నిర్వహించాలి. ప్రతి పౌరుడు దేశ పురోగతికి తన వంతు కృషి చేయాల్సిన సమయం ఇదే” అని పిలుపునిచ్చారు. దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగగా, అధికారులు, నేషనల్ హైవే సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *