
సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26/2026, మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్, బోడుప్పల్ సర్కిల్ 12వ డివిజన్ చెంగిచెర్ల బిజెపి ఉపాధ్యక్షులు గండిపల్లి రాజు మాట్లాడుతూ నేపాల్ వేదికగా 23rd & 24th Jan 2026 లో జరిగిన రోలర్ హ్యాండ్ బాల్ స్కేటింగ్ 2025- 2026 ఛాంపియన్స్ షిప్ అండర్-9 మాస్టర్ ఇషాన్ తేజ్ ఇండియా కెప్టెన్ మరియు అండర్-14 లో మాస్టర్ విశ్వంక్ తేజ్ లు మొదటి అంతర్జాతీయ స్థాయి పోటీలో-పిల్లలు ఇద్దరు గర్వంగా భారత దేశానికి రెండు బంగారు పతకాన్ని గెలుచుకున్నారు ఖాట్మండులోని డార్చోక్ రిక్రియేషనల్ సెంటర్‌లో జరిగిన 1వ అంతర్జాతీయ రోలర్ హ్యాండ్‌బాల్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ 2026 ఈ విశేషమైన కార్యక్రమంలో భారతదేశం, నేపాల్, భూటాన్, శ్రీలంక మరియు బంగ్లాదేశ్ నుండి పాల్గొన్నారు పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో విశ్వంక్ తేజ్ మరియు ఇషాన్ తేజ్ ఇద్దరు ఇండియా జెర్సీ వేసుకొని జాతీయ గీతం పాడుతుంటే భారతదేశ పౌరుడిగా చాలా చాలా గర్వంగా చెప్పుకునే సందర్భం రోమాలు నిక్కబొడుచుకొని నిలబడ్డాయి. ప్రతిసారీ ఇలాంటి సందర్భం రావాలని, ప్రతి దేశంలో మన జాతీయ గీతం పాడాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.పోటీలో భారతదేశానికి కెప్టెన్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ చిచ్చర పిడుగు మాస్టర్ ఇషాన్ తేజ్ అట చూసి అక్కడకి వచ్చిన ఇతరదేశాల కళ్ళు చెదిరే ఆటను ప్రదర్శించి అందరి వృదయాలను దోచుకున్నాడు. కోచ్ సయ్యద్ ముక్తార్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ రోలర్ రింక్ లో ఎట్లా అయిన భారతదేశం నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించు కోవాలని, వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా ఆటలో జట్టును అంత ఏకతాటికి తీసుకువచ్చి ప్రతి ఆటలో 20 నిమిషముల సమయంలో కఠినమైన శ్రమతో 4 నుండి 5 గోల్స్ కొట్టడం ఇండియాకు గోల్డ్ మెడల్స్ అండర్ – 9 లో తీసుకురావడం చాలా గర్వకారణమైన విషయం అదేవిధంగా విశ్వంక్ తేజ్ అండర్ – 14 లో అత్యుత్తమైన అటను ప్రదర్శించి గోల్డ్ మెడల్స్ తీసుకువచ్చాడు మాస్టర్ ఇషాన్ తేజ్ ని కోచ్ లు అందరూ కలిసి టీమ్ ఇండియా కెప్టెన్ అండర్-9 ఎన్నుకోవడం అది మన తెలంగాణ అందులో చెంగిచర్ల నుండి ఎన్నికవ్వడం చాలా గౌరవప్రదమైన విషయం. ఇప్పటి నుండి రోలర్ హ్యాండ్ బాల్ ఆటకు భారతదేశానికి కెప్టెన్ గా అంతర్జాతీయ పోటీలలో బాధ్యత వహించనున్నాడు.రోలర్ హ్యాండ్ బాల్ స్కేటింగ్ ఇది కొత్త తరం క్రీడ స్కేటింగ్ అనేది రోలర్ స్కేటింగ్ వేగాన్ని బాల్ గేమ్‌ల ఉత్సాహంతో మిళితం చేసే ఆధునిక క్రీడ.ఇది బ్యాలెన్స్, కోఆర్డినేషన్, ఫిట్‌నెస్, టీమ్‌వర్క్ మరియు వేగవంతమైన నిర్ణయం తీసుకోవడాన్ని ప్రత్యేకమైన మరియు డైనమిక్ మార్గంలో అభివృద్ధి చేస్తుంది ఇది పిల్లలు, యువత మరియు ప్రొఫెషనల్ అథ్లెట్‌లకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది సురక్షితమైనది, పోటీతత్వంతో కూడినది మరియు స్పష్టమైన నియమాలు, అధికారిక పోటీలు మరియు అంతర్జాతీయ అభివృద్ధి ప్రణాళికలతో ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందేలా రూపొందించబడింది.ఇప్పకాయల విశ్వంక్ తేజ్ 7th క్లాస్, అండర్ -14 టీం ఇండియా సీరియల్ -9 ఇషాన్ తేజ్ 5th క్లాస్ అండర్ 9 టీం ఇండియా సీరియల్ No-5 ఇద్దరు పిల్లలు టీం ఇండియా లో స్థానం దక్కించుకోవడం ఇండియా జెర్సీ నంబర్ లు పొందడం సంతోషకరంగా ఉంది అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలో పాల్గొనడానికి మన తెలంగాణ, భారతదేశం నుండి వెళ్ళడం సహోపేతమైన అటను ప్రదర్శించడం జరిగింది ఇప్పకాయల రాములు – సంధ్య కుమారులు, తెలంగాణ తెలుగు జాతి చిచ్చర పిడుగులు స్కేటింగ్ కోచ్ సయ్యద్ ముక్తార్ & అబ్దుల్ రకీబ్ ఆధ్వర్యంలో మాస్టర్,ఇప్పకాయల విశ్వంక్ తేజ్,మాస్టర్ ఇప్పకాయల ఇషాన్ తేజ్ చెంగిచెర్ల,మేడ్చల్ మల్కాజ్గిరి వాస్తవ్యులు ఇండియా తరుపున ఆడడం చాలా గర్వకారణం. వీరికి ఇది వరకే మూడు జాతీయ పతకాలు, రాష్ట్ర స్థాయిలో మరియు డిస్ట్రిక్ స్థాయిలో అనేక పతకాలు వచ్చాయి పోటీ చేసిన ప్రతి సారి వీరిద్దరికి ప్రతి ఈవెంట్లో మెడల్స్ రావడం జరిగింది ఆటలో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి ఇండియాకు తెలంగాణాకు అదేవిధంగా మన మల్కాజిగిరికి గోల్డ్ మెడల్స్ తీసుకు వచ్చి మంచి పేరు ప్రతిష్టలు,విజయం సాధించి మొదటి ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్నారు. భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి పిల్లలు ఇద్దరు చాటారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అవకాశం కొరకు ఎదురు చూస్తున్నారు ఒక్కవేల తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం గాని స్పాన్సర్ గా వ్యవహరిస్తే పిల్లలు ఇద్దరు తమలోని ప్రతిభా పాటవాలని ప్రదర్శించి విశ్వ విజేతలుగా నిలుస్తారనడానికి గెలిచిన ఇంటర్నేషనల్ మెడల్స్ నిదర్శనము.విజయం వైపు దూసుకుపోయే లక్ష్యాలను సాధించాలనుకునే ప్రతి ఒక్క విద్యార్ధి- విద్యార్దునలకు ఉన్నత శిఖరాలను అధిగమించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు మేడ్చల్ మల్కాజిగిరి, చెంగిచర్ల నియోజక వర్గానికి చెందిన రాజకీయనాయకులు, ఈటల రాజేందర్,చామకూర మల్లారెడ్డి,వజ్రస్ యాదవ,అజయ్ యాదవ,బింగి జంగయ్య యాదవ్,కొత్త కిషోర్ గౌడ్,కొత్త రవి గౌడ్,ఏనుగు సుదర్శన్ రెడ్డి మరియు గండిపల్లి రాజు అదే విధంగా కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు పిల్లలకు అభినందనలు తెలియచేశారు.