సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ గాజుల శ్రీనివాస్ గౌడ్ జనవరి 26/01/2026 వెల్గటూర్ మండలం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు తరఫున పాల్గొని రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ లో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలవగా రామ్ చరణ్ శ్రీజ శివ లను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ . కరాటే తో ఆత్మరక్షణ మనోధైర్యం శారీరక దారుడ్యాం పెంపొందుతుంది అన్నారు. తల్లిదండ్రులు చదువుతో పాటు క్రీడలు,ఆత్మరక్షణ నైపుణ్యాన్ని ప్రోత్సహించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరుముల్ల పవన్ ,కోచ్ జగన్,ములసపు మహేష్ ,తదితరులు పాల్గొన్నారు.