సాక్షి డిజిటల్ న్యూస్, రిపోర్టర్ బొక్కానాగేశ్వరరావు, జనవరి 26 2026, రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగకుండా ఉంటే చర్యలు తప్పవని నందిగామ రూరల్ సీఐ చవాన్ హెచ్చరించారు. రౌడీ షీటర్లకు కంచికచర్ల పోలీసు స్టేషన్ లో ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు అల్లర్లు, అలజడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. చెడు నడత కలిగిన రౌడీ షీటర్లపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. రౌడీ షీటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరూ సంబంధిత స్టేషన్లలో సంతకాలు చేస్తూ ఉండాలన్నారు. బయట ప్రాంతాలకు వెళ్లే సమయంలో స్టేషన్ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై ఏదైనా అనుమానం వస్తే వెంటనే అదుపులోకి తీసుకుని బైండోవర్ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ ఐ 2 నాని నారేందర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.