సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వేగి రామారావు అనకాపల్లి జనవరి 26: కే.కోటపాడు మండలం సూది వలస గ్రామంలో శ్రీ నూకాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం తెల్లవారు జాము 5 గంటల నుంచే అమ్మవారికి ధూప–దీప–నైవేద్యాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామ పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో తీర్థ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అదేవిధంగా రాత్రి 9 గంటల నుంచి ‘సామ్రాట్ అశోక్’ అనే సాంఘిక నాటకాన్ని కడు రమ్యంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామ పెద్దలు, ప్రజలు, యువకులు, ఆలయ కమిటీ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.