సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి.26, బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పెద్దతిసముద్రం లోని కస్తూరిబా విద్యార్థిని లకు బాలికా దినోత్సవం పై అవగాహన కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్ వైజర్స్ హిజాద్ ప్యారి.రామలక్మి.మాట్లాడుతూ ” నేటి బాలికయే రేపటి జాతి సంపద అని, తల్లి గర్భంలో నలుసుగా పడింది మొదలు మన దేశంలో ఆడబిడ్డ ఎదురుకుంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావని, ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మహిళలు తమ జీవితాంతం ఎదుర్కొనే పెద్ద సమస్య లింగ వివక్షత, భారతదేశం ఆడపిల్లల హక్కులు మరియు ఆమె విద్య ఆరోగ్యం మరియు పోషకాహారం యొక్క ఆవశ్యకత గురించి అవగాహన పెంచడానికి, బాలికల పట్ల కొనసాగుతున్న వివక్షను తొలగించి వారి సమగ్రాభివృద్ధే లక్ష్యంగా 2009 నుంచి ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటు న్నామని, మన అమ్మాయిలు జీవితాలకు వెలుగులు మరియు వారిని అలాగే చూసుకోవాలని, మన జీవితాల్లోని స్త్రీలను మనం ఎల్లప్పుడూ గౌరవించాలని, ఎందుకంటే వారు మన జీవితాలకు మూల స్తంభాలు అని, ఆడపిల్లలకు సాధికారత కల్పించి, విద్యను అందించి, సురక్షితంగా ఉంచాలని, ఆడబిడ్డలు రక్షించడం అంటే దేశాన్ని రక్షించడమేనని, ఆడపిల్లలను చులకనగా చూడొద్దని, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని, ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి, చదువులో సరస్వతి, ఆదరించడంలో అన్నపూర్ణాదేవి ,కానీ ఇప్పటికీ ఆడపిల్ల అంటే ఓ టెన్షన్ అనే భావన చాలామందిలో ఉందని, అయితే ఆడపిల్ల అంటే టెన్షన్ కాదని టెన్ సన్స్ ( పదిమంది కుమారులు) కు సమానమని, నేటితరం బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, సమాజంలో బాలికల సంరక్షణ పై అవగాహన కల్పించడానికి బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించాలని, బాలికల విద్య సమాజపురోగతికి, ఆర్థిక బలోపేతానికి, కుటుంబానికి అత్యంత ఆవశ్యకమని, విద్యావంతులైన మహిళలు పేదరిక నిర్మూలన, బాల్య వివాహాల అరికట్టడం, నిర్ణయ అధికారం మరియు లింగ సమానత్వాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తారని, ఇది సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఆరోగ్యకరమైన, జ్ఞానవంతమైన తర్వాతి తరాలను నిర్మించడానికి సహాయపడుతుందని, చదువుకున్న బాలికలు స్వతంత్రులుగా మారి, తమ కాళ్ళపై నిలబడి కుటుంబ ఆదాయానికి తోడ్పడతారని, విద్యావంతులైన తల్లులు కుటుంబ ఆరోగ్యం, పోషకాహారం మరియు పరిశుభ్రతపై మెరుగైన నిర్ణయాలు తీసుకోగలరని, బాల్యవివాహాలు, వరకట్నం మరియు లింగ వివక్ష వంటి సామాజిక అన్యాయాలను ఎదుర్కోవడంలో బాలిక విద్య తోడ్పడుతుందని, తమ కెరీర్, వివాహం మరియు కుటుంబ విషయాలలో బాలికలు సరైన నిర్ణయాలు తీసుకునేలా విద్య శక్తినిస్తుందని, బాలికల విద్య వల్ల దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి గణనీయంగా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయని, భారత ప్రభుత్వం బాలికా విద్యను ప్రోత్సహించడానికి భేటీ బచావో – భేటీ పఢావో, సుకన్య సమృద్ధి యోజన మరియు ఉడాన్ వంటి పథకాలను అమలు చేస్తుందని, అందువల్ల బాలికలకు సమాన విద్య అవకాశాలు కల్పించడం అంటే దేశ భవిష్యత్తును సుసంపన్నం చేయడమేనని” పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోమండల విద్యాశాఖ అధికారులు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు. కస్తూరిబా ప్రిన్సిపాల్.మరియు సిబ్బంది. విద్యార్థినిలు పాల్గొన్నారు.