సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 26, జిల్లా ఇంచార్జి, విశాఖపట్నం. జీవీఎంసీ, నార్త్ జోన్ , 50వ వార్డు, మాధవధార కళింగానగర్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అనాధికారిక అక్రమ నిర్మాణం జరిగింది ఈ నిర్మాణానికి అదనముగా వేసిన ఫ్లోర్ కి ఎటువంటి అనుమతులు లేవు ఈ నిర్మాణాన్ని చట్టాలు ఉల్లంఘించి అనధికారికంగా నిర్మాణాన్ని చేశారు. ఇంత జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు గానీ ఏసీపీ సచివాలయం సిబ్బంది వార్డ్ ప్లానింగ్ రెగ్యులేటరీ సెక్రటరీ చర్యలు తీసుకుపోవడంపై అనేక అనుమానాలుకి దారితీస్తుంది ఈ నిర్మాణం పై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు, ఈ నిర్మాణానికి రోడ్డు వి్డెనింగ్ ఫైర్ సేఫ్టీ ఇతర సమస్యలు సమస్యలు అడ్డంకులు ఉన్నప్పటికీ ఈ నిర్మాణాన్ని కొనసాగించారు. ఇలాంటి అనధికార నిర్మాణాలు వల్ల జీవీఎంసీ ఆదాయానికి గండి కొడుతూ టౌన్ ప్లానింగ్ అధికారులు బిల్డర్స్ అక్రమంగా జోబులు నింపుకుంటున్నారు, గత కొద్దికాలంగా నార్త్ జోన్ లో అనేక అక్రమ నిర్మాణాలు కొనసాగు తున్నాయి వీటిపైన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, టౌన్ ప్లానింగ్ ఉన్నత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడవలసి ఉన్నది వెంటనే ఈ యొక్క నిర్మాణాన్ని నిలిపివేయాలని స్థానిక ప్రజలు ప్రజా సంఘ నాయకులు కోరుకుంటున్నారు.