శంకుస్థాపనలు చేసి వొదిలేసే ప్రభుత్వం కాదు కాంగ్రేస్ ప్రభుత్వం

*సుల్తానాబాద్ మున్సిపల్ లో15 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు *సుల్తానాబాద్ పట్ల గత పాలకుల నిర్లక్ష్యం.. *అభివృద్ధిని చూసి ఓటు వేయండి… *కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే మరింత అభివృద్ధి… *శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు

సాక్షి డిజిటల్ న్యూస్, 26 జనవరి 2026, సుల్తానాబాద్ మండల్ రిపోర్టర్ టి సంజయ్ : శంకుస్థాపనలు చేసి వొదిలేసే ప్రభుత్వం కాదు కాంగ్రేస్ ప్రభుత్వం అని సుల్తానాబాద్ మున్సిపల్ లో15 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలుచేశామని, సుల్తానాబాద్ పట్ల గత పాలకుల నిర్లక్ష్యం కనిపిస్తుందని, అభివృద్ధిని చూసి ఓటు వేయండి,కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని 1 వ వార్డులో 1,31 కోట్లు, 2 వ వార్డులో 96 లక్షలు, 3 వ వార్డులో 47 లక్షలు, 4 వ వార్డులో 73 లక్షలు,5 వ వార్డులో 94 లక్షలు, 6 వ వార్డులో 1,05 కోట్లు,7 వ వార్డులో 97 లక్షలు,8 వ వార్డులో 1.49 కోట్లు,9 వ వార్డులో 50 లక్షలు,10 వ వార్డులో 63 లక్షల రూపాయల నిధులతో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు పలు అభివృద్ధి పనులకు స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ. సుల్తానాబాద్ అభివృదే ధ్యేయంగా పక్కా ప్రణాళికలతో నిధులు మంజూరి చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే రూ.20 కోట్లతో సుల్తానాబాద్ పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. పట్టణంలోని చెరువు రోడ్డు రాజీవ్ రహదారి నుండి పాత జెండా, శివాలయం, ఇందిరానగర్ వరకు సిసి రోడ్డు నిర్మాణం, అలాగే, పాత జెండా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు సిసి రోడ్డు నిర్మాణం, పూసాల చౌరస్తా రాజీవ్ రహదారి నుండి పూసల చెరువు సమీపం వరకు సిసి రోడ్డు, డివైడర్లు, అందమైన సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుల్తానాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం నుండి శాంతినగర్ వరకు కాల్వశ్రీరాంపూర్ రోడ్డును రూ.16 కోట్లతో విస్తరణ పనులు, నిర్మాణం చేయడం జరుగుతుందని త్వరలోనే పనులు పూర్తవుతాయని తెలిపారు. ప్రస్తుతం మరిన్ని నిధులను వెచ్చించి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, మున్సిపల్ ఆఫీస్ లకు నూతన భవనాలు, రూ. 8.50 కోట్లతో చెరువు కట్ట ను మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తామని అన్నారు. రుణమాఫీ, జీరో కరెంటు బిల్లులు, తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, కటింగ్లు లేకుండా వడ్ల కొనుగోల్లు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి పాలకులు సుల్తానాబాద్ పట్ల వివక్ష, నిర్లక్ష్యం చూపించారని తెలిపారు. తాను పుట్టిన ఊరు శివపల్లి అయినప్పటికీ పెరిగింది మాత్రం సుల్తానాబాద్ లోనే, అందుకే ఆ మమకారం ను అభివృద్ధి పనుల్లో చూపిస్తానని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వినుపాల ప్రకాష్ రావు, మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, శ్రీగిరి శ్రీనివాస్, సాయిరి మహేందర్, గాజుల రాజమల్లు, పన్నాల రాములు, అమిరిశెట్టి రాజలింగం, తిరుపతి, కుమార్ కిషోర్,ఊట్ల రమ వరప్రసాద్, వేగోళం అబ్బయ్య గౌడ్, బిరుదు సమత కృష్ణ, ఊట్ల వర ప్రదీప్, చింతల సునీత రాజు, గరిగే శ్రీనివాస్, దున్నపోతుల రాజయ్య, గాదాసు రవీందర్,ఈర్ల శేఖర్, తొర్రికొండ ప్రభాకర్, సముద్రాల విష్ణు, దున్నపోతుల మధు, ధన్నాయక్ దామోదర్ రావు, శ్రీనివాసరావు, గాజుల హరీష్, అమీనుద్దీన్ నన్ను, మేడి శ్రీనివాస్, టీకే ప్రభాకర మూర్తి,న్యాతరి శ్యాంసుందర్, న్యాతరి దేవేందర్ లతోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *