సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 26 – 2026 (యర్రగొండపాలెం ఆర్ సి ఇంచార్జ్ ) రాము G, వైసీపీ దళిత ఎమ్మెల్యే గా ఉండి దళిత సర్పంచ్ కి ప్రోటోకాల్ పాటించరా? – ఆపై అధికార పార్టీ మీద ప్రోటోకాల్ కోసం పోరు : వైసీపీ సర్పంచ్ రేపు రాజీనామా చేయనున్న సుంకేసుల వైసీపీ సర్పంచ్ గుడ్డెపోగు రమేష్ – ఎమ్మెల్యే కార్యక్రమాల లో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ వ్యాఖ్య పెద్దారవీడు మండలం సుంకేసుల వైసీపీ సర్పంచ్ గుడ్డెపోగు రమేష్ రేపు ఉదయం రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ సందర్బంగా అయన తెలుపుతూ… ఎమ్మెల్యే తన గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో తనకు పిలవకుండా, ప్రోటోకాల్ పాటించడం లేదని, OC సామాజిక నాయకుడు తమపై పెత్తనం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే దళితుడిగా ఉండి కూడా ఈ వైఖరి తెలిసి కూడా నోరు మేదపలేదని, తనకు తెలియకుండానే తన సొంత గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే కార్యక్రమాలకు సర్పంచ్ గా తనను ఆహ్వానించకపోవడాన్ని ఖండిస్తూ రేపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దళిత ఎమ్మెల్యే గా ఉండి ఒక దళిత సర్పంచ్ పట్ల వ్యవహారించాల్సిన వైఖరి ఇదేనా అంటూ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై రమేష్ మండిపడ్డారు.