సాక్షి డిజిటల్ న్యూస్, 25/జనవరి/2026, షాద్ నగర్ రిపోర్టర్ కృష్ణ, తెలంగాణ ఆమెచూర్ బాడీ బిల్డర్స్ అండ్ ఫిట్నెస్ అసోసియేషన్ హైదరాబాద్, తెలంగాణ వారి అధ్యర్యంలో షాద్ నగర్ SRK జిమ్ నిర్వాహకులు షారుఖ్ ఖాన్ అధ్యర్యంలో ఫిబ్రవరి 4 వ తేదీన స్థానిక కుంట్ల రాంరెడ్డి ఫంక్షన్ హల్ లో SRK CLASSIC మిస్టర్ షాద్ నగర్ బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నామని SRK జిమ్ నిర్వాహకులు, ఈవెంట్ ఆర్గనైజర్స్ షారుఖ్ ఖాన్ తెలిపారు. ఈ సందర్బంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణ ఆమెచూర్ బాడీ బిల్డర్స్& ఫిట్నెస్ అసోసియేషన్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ఎం.ఏ. సలీం, జాయింట్ సెక్రటరీ రజ్జాక్, ట్రెజరర్ అల్తాఫ్ పాల్గొని పోటీలకు సంబందించిన విషయాలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ షాద్ నగర్ లో మొట్టమొదటి సారిగా పెద్దఎత్తున బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలలో మొత్తం మూడు లక్షల ఇరవై వేలు ( 3.20000 =00) బహుమతులుగా విజేతలకు అందజేస్తున్నామని అన్నారు.వివిధ రాష్ట్ర ల నుండి ఈ పోటీలకు బాడీ బిల్డర్స్ వస్తున్నారని ఇది ఓపెన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షీప్ కాబట్టి ఎవ్వరైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చని అన్నారు.ఇందులో సీనియర్ బాడీ బిల్డింగ్, బాడీ బిల్డింగ్ జూనియర్, మేన్స్ క్లాసిక్ ఓపెన్, మాస్టర్స్, మేన్స్ ఫిజిక్స్, మేన్స్ ఫిజిక్స్ జూనియర్, డెనిం జీన్స్ ఓపెన్ తదితర విభాగలలో పోటీలు నిర్వహించబడుతాయని అన్నారు. ఇందులో పాల్గొనదల్చిన, ఆసక్తి కలవారు SRK జిమ్ & ఫిట్నెస్ యజమాని షారుఖ్ ఖాన్ ను సంప్రదించాలని కోరారు.ఈ మీడియా సమావేశం లో ట్రైనర్స్ మహేశ్వరి, హరీష్, సోహైల్, అఖిబ్ హుస్సేన్, ఫర్హాన్, లక్ష్మణ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.