ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, బలపరిచే వ్యక్తులు పన్నులు పూర్తిగా చెల్లించాలి.

సాక్షి డిజిటల్ న్యూస్ 25 జనవరి 2026 జమ్మికుంట టౌన్, జమ్మికుంట : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పన్నులు పూర్తిగా చెల్లించాలని, అభ్యర్థిని బలపరిచే వ్యక్తులు సైతం పన్నులు పూర్తిగా చెల్లించి ఉండాలని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేసే అభ్యర్థులు, బలపరిచే వ్యక్తులు ఇంటి పన్నులు, నల్ల పన్నులు, బలపరిచే వ్యక్తులకు సంబంధించిన షాపు ఉంటే ఆ షాపుకు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ పూర్తి చెల్లించి నామినేషన్ వేయాలని, లేని పక్షంలో నామినేషన్ తిరస్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *