డెస్క్ జర్నలిస్ట్కిషోర్ కుటుంబానికి ఆర్థిక సహాయము

*1,03,000 అందించిన ఆంధ్రప్రభ కుటుంబ సభ్యులు *భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా

సాక్షి డిజిటల్స్ విశాఖ ప్రతినిధి సంజయ్ ఆంధ్రప్రభ తెలుగు జాతీయ, దినపత్రికలో డస్క్ జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన పి కిషోర్ కుమార్ ఇటీవలే ఆకస్మికంగా మృతి చెందారు.. అప్పటివరకు అందరితోనూ సరదాగా కలిసిమెలిసి తిరిగే కిషోర్ అనుకోకుండా కన్ను మూసారు.. కిషోర్ కు భార్య స్రవంతి.. ఇద్దరు పిల్లలు కలిగి ఉండగా.. కుమారుడు సాయి భాస్కర్ (తొమ్మిదవ తరగతి).. కుమార్తె గాయత్రి (ఆరో సంవత్సరం) విద్యాభ్యాసం సాగిస్తున్నారు.. నిరుపేద కుటుంబానికి చెందిన కిషోర్ ను ఎంతో కొంత ఆదుకోవాలని భావించి ఆంధ్రప్రభ కుటుంబ సభ్యులు విశాఖపట్నం,, విజయనగరం,, శ్రీకాకుళం మిత్రులంతా కలిసి 1,03,000 ఆర్థిక చేయూతను అందించారు.. అలాగే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రభ ట్రస్ట్ తరఫున సీజీఎం పసునూరి భాస్కర్.15000 అందించారు.. జిఎం గంజి వెంకటేశ్వర్లు 10000. ఆర్థిక సహాయం చేశారు. ఈ మొత్తాన్ని శనివారం విజయనగరం లో ఉన్న కిషోర్ కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రభ గ్రూప్ సంస్థల రీజనల్ కోఆర్డినేటర్ . ఉమ్మడి విశాఖ బ్యూరో చీఫ్ గంట్ల శ్రీనుబాబు, అసిస్టెంట్ మేనేజర్ చిరికి దేవుడు నాయుడు, విజయనగరం జిల్లా బ్యూరో చీఫ్ బి జి ఆర్ పాత్రో, స్టాఫ్ ఫోటో జర్నలిస్టు పీ నగేష్ బాబు.. డిజిటల్ మీడియా ప్రతినిధి కింతాడ మదన్ తదితరులు చేతుల మీదుగా అందజేశారు.. ఈ సందర్భంగా కిషోర్ కుటుంబ సభ్యులుకు అండగా ఉంటామని వీరంతా ధైర్యం చెప్పారు.. భవిష్యత్తులో కూడా తమ పరిధి మేరకు సహాయం అందిస్తామన్నారు.. కిషోర్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించిన విశాఖపట్నం.. విజయనగరం ..శ్రీకాకుళం ఆంధ్రప్రభ కుటుంబ సభ్యులకు మరియు సంస్థ సీజీఎం..జనరల్ మేనేజర్ భాస్కర్ ..వెంకటేశ్వర్లు తదితరులకు గంట్ల శ్రీనుబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కొద్ది నెలల క్రితం మృతి చెందిన ఆంధ్రప్రభ సర్కులేషన్ మేనేజర్ రావు గారి కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రభ కుటుంబ సభ్యులు లక్ష మొత్తం. ఆర్థిక సహాయం అందించారు.. కోవిడ్ లో సైతం పలువురికి సహాయం అందించినట్లు గంట్ల శ్రీనుబాబు చెప్పారు.. ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నప్పుడే అందరు కుటుంబాలకి భరోసా కలుగుతుంది అన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *