సాక్షి డిజిటల్ న్యూస్,కొండపాక జనవరి 25, రిపోర్టర్ తిరుపతి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను, 2025 విద్యుత్ చట్టాన్ని, వి బి జి రాంజీ పథకాన్ని వ్యతిరేకిస్తూ జరిగే సమ్మెలో కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. శనివారం రోజున ఆఫీస్ బేరర్స్ సమావేశం కార్మిక కర్షక భవనం సిద్దిపేటలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ. ఈ సమావేశంలో గత మహాసభల్లో ఆఫీస్ బేరర్ గా కో ఆప్షన్ ఉన్నది. దాన్ని శనివారం రోజున అమ్ముల బాల్ నర్సయ్యను సిఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడిగా తీసుకొని ఆఫీస్ బేరర్స్ స్థానాన్ని భర్తీ చేయడం జరిగిందన్నారు.కార్మికులు, రైతులు,వ్యవసాయ కూలీలు ప్రజలు ఎదుర్కొంటున్న 20 డిమాండ్లను జాతీయ కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాయని వాటిని వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.అంబానీ, ఆదాని అంటే కార్పొరేట్ ప్రయోజనాలు తప్ప కార్మికుల సమస్యలు మోడీ ప్రభుత్వం పట్టడం లేదని అన్నారు లేబర్ లేబర్ కోడ్ తో శ్రమ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుందని అన్నారు.కనీస వేతనం రూ. 26000 పెంచాలని, గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న హామాలి కార్మికులకు సమగ్ర చట్టం అమలు చేయాలని కార్మికులను గుర్తించి వారికి ప్రమాద బీమా సౌకర్యాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజి రాంజీ ఉపాధి పథకాన్ని ఉపసంహరించుకొని గతంలో పోరాడి సాధించుకున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ చట్టం మార్పు వల్ల కార్మికులకు ఉపాధి హామీ పని లేకుండా పోతుందన్నారు.125 రోజుల పని దినాలు పెంచి వ్యవసాయ పనుల పేరుతో 60 రోజులు తగ్గించి కార్మికులకు 65 రోజులు ఉపాధి పనులు చూపించడము ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే విభిజి రాంజీ పథకాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు కర్షకులు అన్ని రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాముని గోపాలస్వామి, సిఐటియు ఆఫీస్ బేరర్స్ చొప్పరి రవికుమార్, శెట్టిపల్లి సత్తిరెడ్డి,గొడ్డుబర్ల భాస్కర్,ఇప్పకాయల శోభ,మామిడాల కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.