పెనగలూరులో ఘనంగా ముగిసిన వారహి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్..

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 పెనగలూరు రిపోర్టర్ మధు, విజేతలకు బహుమతులు అందించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం పెనగలూరు మండలంలో జిల్లా ఉన్నత పాఠశాల గ్రౌండ్ నందు నిర్వహించిన వారహి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం ఉత్సాహంగా జరిగింది. ఈ ఫైనల్ పోటీలో మనీ లెవన్స్ సాతుపల్లి జట్టు విజేతగా నిలవగా, సింగనమాల గ్రామానికి చెందిన మధు లెవన్స్ రన్నరప్‌గా నిలిచింది. ఈ సందర్భంగా విజేతలకు, రన్నరప్ జట్లకు కప్పులను ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసన సభ్యులు అరవ శ్రీధర్ మరియు రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి అందజేశారు. అరవ శ్రీధర్ మాట్లాడుతూ,క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయి. గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని” పేర్కొన్నారు. *ముక్కా సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ, “యువతను సరైన దిశలో నడిపించే శక్తి క్రీడలకు ఉంది. గ్రామాల్లో ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల ఆరోగ్యం, ఐక్యత రెండూ బలపడతాయి.” అని అన్నారు. ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన సభ్యులు యర్రంశెట్టి హరి బాబు రాయల్, కోడిదల సాయి కుమార్‌ మరియు ఆర్గనైజర్స్:గొబ్బూరు హరి, సచిన్,వెంకట్ ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటగాళ్లను ప్రోత్సహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *