దీనస్థితిలో భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహంపై నిర్లక్ష్యం

*ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరి *మేజర్ గ్రామపంచాయతీ సమితి సింగారం

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 25 మణుగూరు /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కోర్లపాటి రాజేష్ ఖన్న: భారత తొలి న్యాయశాఖ మంత్రికి ఘోర అవమానం మణుగూరులో దీనస్థితిలో ‘రాజ్యాంగ నిర్మాత’ విగ్రహం దేశ తొలి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నేడు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమితి సింగారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అపచారం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే బండారుగూడెం రోడ్ల విస్తరణలో భాగంగా కొత్త అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పిన అధికారులు, పాత విగ్రహాన్ని గాలికొదిలేశారు. గత 30 ఏళ్లుగా ఎంతో ఆదరణ పొందిన ఈ విగ్రహం నేడు చిందర వందరగా, చెత్తాచెదారం మధ్య దర్శనమివ్వడం సభ్య సమాజానికి సిగ్గుచేటుగా మారింది. దళిత సంఘాల ఆగ్రహం రోడ్ల విస్తరణ పేరుతో విగ్రహ ప్రాంగణంలో నరికివేసిన పెద్ద పెద్ద చెట్ల మొండాలను విగ్రహం ముందు భాగంలోనే పడవేయడంపై దళిత సంఘాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. కొత్త విగ్రహం ఏర్పాటు చేసినంత మాత్రాన, పాత విగ్రహాన్ని అగౌరవపరచడం ఎంత వరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. విగ్రహ ప్రాంగణాన్ని అగౌరవ పరిచేలా వ్యవహరించిన అధికారులు కేవలం చేతులు దులుపుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, పాత అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని శుభ్రం చేయించాలని, ఆ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకు రావాలని మణుగూరు దళిత సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *