సాక్షి, డిజిటల్ న్యూస్, జనవరి 25, శంకరపట్నం, కరీంనగర్ జిల్లా, సీనియర్ జర్నలిస్టు, బూర్ల రాజు !!
గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని మేజర్ గ్రామపంచాయతీ మోలంగూర్ ఉప సర్పంచ్ దండు రాజేష్ అన్నారు,, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అట్టడుగు వర్గాల కు అందుబాటులో ఉండే సేవ చేస్తానన్నారు, రాజకీయాలకతీతంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తానని ఆయన చెప్పారు, గ్రామములో కనీస వసతులు కల్పించి పేదలకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానన్నారు, గ్రామాన్ని అభివృద్ధి చేయుటకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆశీస్సులతో కీలక పాత్ర పోషిస్తానన్నారు, ముఖ్యంగా పాఠశాల గదులు శిథిల వ్యవస్థలో ఉన్నాయన్నారు, పక్క భవనం నిర్మాణం కోసం నిధులు మంజూరుకు ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు,, తాను ఉన్నత స్థాయి చదువులు చదివిన ఉద్యోగం రాకపోవడంతో రాజకీయాలపై ఆసక్తి చూపడం జరిగిందని ఆయన చెప్పారు, గ్రామంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు,, సుబ్బండ వర్గాల ప్రజల ఆశీస్సులతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయుటకు కీలకంగా వ్యవహరిస్తానని ఉపసర్పంచి రాజేష్ తెలిపారు.